![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -99 లో... జ్యోత్స్న వాళ్ళ అమ్మతో మాట్లాడటానికి వారి ఇంటికి వస్తాడు కార్తిక్. తన అత్తకి జోత్స్నని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పడానికి వచ్చిన కార్తీక్ దగ్గరకు జ్యోత్స్న వస్తుంది. ఆ విషయం ఏంటో నాతో చెప్పు బావ.. మా అమ్మతో ఏం చెప్పాలనుకున్నావ్.. అదేంటో చెప్పు బావా? లేదంటే నేను చచ్చినట్టే అని తనపై ఒట్టుపెట్టుకుంటుంది జోత్స్న. ఇక కార్తీక్.. నిజం చెప్పడానికి ఇదే మంచి టైమ్ అని అనుకుంటాడు. ఇంతలో కార్తీక్‌కి కడియం ఫోన్ చేసి విషయం చెప్తాడు.
ఇక విషయం తెలుసుకున్న కార్తిక్ కంగారుగా అక్కడి నుండి బయల్దేరి వెళ్ళిపోతాడు. ఆ స్పీడ్ చూసిన జ్యోత్స్న.. దీప దగ్గరికి వెళ్తున్నాడేమోనని కంగారుగా తననే ఫాలో అవుతుంది. ఇక శౌర్యని కార్తిక్ తీసుకుని దీప ఇంటికి వెళ్తాడు. అది చూసిన జోత్స్న షాక్ అవుతుంది. ఊరికి దూరంగా దీపతో దుకాణం ఇక్కడ పెట్టావా బావ.. అడ్రస్‌తో సహా మీరిద్దరూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికేశారు బావ.. మా ముందు ఏమీ తెలియనట్టు నటిస్తూ.. రోజూ వచ్చి దీపని ఇక్కడ కలుస్తున్నావా.. చెప్తా నీ సంగతి అని జ్యోత్స్న అనుకుంటుంది. శౌర్యని దీపకి అప్పగిస్తాడు కార్తిక్. అదే సమయంలో ఇంట్లోని గోడపై ఉన్న కార్తీక్ పేరును చూస్తాడు. ఇంతలో రౌడీ గమనించి.. నువ్వు నాతో లేవు కదా.. అందుకే నీ పేరు గోడపై రాశానని అంటుంది. దాంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు.
కార్తీక్‌కి నాపై ప్రేమలేదు.. నీ కోసం రాడని అన్నావ్ కదమ్మా.. చూడు నా కార్తీక్ నాకోసం వచ్చేశాడు.. కార్తీక్ కి ఈ ఇంటి అడ్రస్ తెలియదంట.. అందుకే రాలేదు.. అడ్రస్ తెలిస్తే ఎప్పుడో వచ్చేసేవాడని శౌర్య అంటుంది. నా గుండె ఇంకా భయంతో కొట్టుకుంటూనే ఉంటుంది.. బూచోడు మళ్లీ వస్తాడా? అని కార్తీక్‌ని శౌర్య అడుగుతుంది. ఏంటి బూచాడు ఏంటని దీప కంగారుపడుతుంటే.. నీకంతా తర్వాత చెప్తాను.. శౌర్య నువ్వు రెస్ట్ తీసుకో అని కార్తిక్ అంటాడు. నన్ను వదిలి వెళ్లిపోకు కార్తీక్.. ఇక్కడే ఉంటావ్ కదా హాస్పిటల్‌లో కూడా ఇలాగే వదిలేసి వెళ్లిపోయావని కార్తిక్ తో శౌర్య అనగా.. నిన్ను వదిలి వెళ్లను రౌడీ అని దీప వైపు చూస్తాడు. మీరు ఒకసారి బయటకు రండి మాట్లాడుకుందామని దీప అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |